Adhika Jyeshtha Purnima 2026 : మే 31, ఆదివారానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇదే రోజున అధిక జ్యేష్ఠ పౌర్ణమి వస్తుంది. మరి ఆ రోజు పాటించాల్సిన నియమాలు ఏంటంటే...

Adhika Jyeshtha Purnima 2026 : ఈ నెలాఖరున అంటే మే 31న ఆదివారం వస్తుంది. దీనికి చాలా విశిష్టత ఉంది. ఆదివారం నాడే పౌర్ణమి కూడా వస్తుంది. పైగా ఇది జ్యేష్ఠ పౌర్ణమి కావడంతో మరింత్ర ప్రత్యేకతను సంతరించుకుంది. సూర్యచంద్రుల అనుగ్రహం కలిగించే ఒక శక్తివంతమైన మహా యోగం అంటున్నారు పండితులు. ఈ ఆదివారం సూర్యుడికి, పౌర్ణమి మహాలక్ష్మికి ప్రీతిపాత్రమైన రోజులు. కనున ఆదివారం నాడు పూజ చేసుకుని కొన్ని ప్రత్యేక పరిహారాలు పాటిస్తే.. మీ జీవితంలోని సమస్యలన్ని తీరిపోయి అఖండ రాజయోగం కలుగుతుందని.. మీ ఇంట కనకవర్షం కురుస్తుందని అంటున్నారు.
ఈ ఆదివారం ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసుకోవాలి. అలానే స్నానం చేసే నీటిలో కల్లుప్పు వేసుకుని స్నానం చేయడం వల్ల శరీరానికి, మనసుకు పట్టిన ప్రతికూల శక్తి (నెగిటివ్ ఎనర్జీ) తొలగిపోతుంది
సింహద్వార పూజ:
ఇంటి గడపను పసుపు కుంకుమలతో అలంకరించి, మామిడి ఆకుల తోరణాలు కట్టి లక్ష్మీదేవికి స్వాగతం పలకాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట లక్ష్మీ దేవి కొలువై ఉంటుందంటున్నారు పండితులు.
ఆర్థిక సమస్యల కోసం పరిహారం:
ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఈ ఆదివారం నాడు ఒక ఎరుపు లేదా పసుపు వస్త్రంలో ఐదు యాలకులు, ఐదు లవంగాలు, ఒక రూపాయి బిళ్ళ వేసి మూట కట్టి పూజలో ఉంచాలి. ఆ తర్వాత దాన్ని దానిని బీరువాలో పెట్టుకోవడం వల్ల ధన లాభం కలుగుతుంది అంటున్నారు పండితులు.
ఇతర పూజలు:
తులసికోట దగ్గర నెయ్యి దీపం వెలిగించి ఐదు ప్రదక్షిణలు చేయాలి
ఇంటికి దిష్టి తగలకుండా గుమ్మానికి పసుపు రాసిన బూడిద గుమ్మడికాయ కట్టాలి
చేయకూడని పనులు:
పౌర్ణమి నాడు పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు
అలానే పౌర్ణమి నాడు అంటే ఈ ఆదివారం సాయంత్రం 6 గంటల తర్వాత ఎవరికీ పాలు, పెరుగు, పసుపు, కుంకుమ, ఉప్పు లేదా డబ్బును అప్పుగా ఇవ్వకూడదు
ఆదివారం నాడు సూర్యాస్తమయం తర్వాత ఇల్లు ఊడవడం, గోర్లు తీయడం, జుట్టు కత్తిరించుకోవడం చేయకూడదు.
తులసి ఆకులను తుంచడం వంటివి చేయకూడదు.
ఉప్పు దీపం (ఐశ్వర్య దీపం):
పేదరికం తొలగి.. ఆర్థికంగా కలిస రావాలంటే ఈ పౌర్ణమి నాడు ఐశ్వర్య దీపం అంటే ఉప్పు దీపం పెడితే మంచిది అంటున్నారు పండితులు.
అందుకోసం ఆదివారం సాయంత్రం ఒక మట్టి ప్రమిదలో కల్లుప్పు పోసి, దానిపై మరో దీపం పెట్టి వెలిగించాలి
దీనివల్ల పేదరికం తొలగి అఖండ రాజయోగం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
చంద్ర దర్శనం:
రాత్రి సమయంలో చంద్రుడిని దర్శించుకుని, రాగి లేదా వెండి గ్లాసులో పాలు, నీళ్లు కలిపి చంద్రుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది
దానం:
ఇంటి ముందుకు వచ్చే పేదవారికి లేదా సాధువులకు తోచినంత అన్నదానం లేదా వస్త్రదానం చేయడం శుభప్రదం.
ఈ నియమాలను భక్తిశ్రద్ధలతో పాటించడం వల్ల జీవితం ఆనందమయంగా మారుతుందని మూలాలు పేర్కొంటున్నాయి.





